76. తే.గీ." బొగడశక్యంబె భక్తాళి పుణ్యమెంతో
దెలియగలవారికే యిది తెలియుగాని
తక్కుగలవారుతెలిసికో తగరు తగరు
ఖాదరు వలీంద్ర ఘనయశో కరుణసాంద్ర .
77 . మ." ఎట్టి రూపముతోడ గొల్తును నెట్టిపెరున బిల్చెద
ఇట్టి భ్రాంతిని వీడజేయుచు, నెట్లు బ్రోతువొ నన్నికన్
బట్టి యుంటిని నీదు పదములు బాబఖాదరుషా? యికన్
గట్టి దైర్యమునాకు గల్గె ను కలుగుటెట్లగు చింతలున్.
78 . శా" నిన్నే నమ్మిన బ్రేమ భక్తులగుచున్ నీ సేవయే జేయుచున్
నేన్నండున్ మరివేరె గోరకయే వారేకత్వభావంబుతో
నిన్నేదల్చుచున్ వారి నహహా నేవేల పారీక్షలన్
యన్నా చేయుట న్యాయమా యిటుల బాబాదేవ దేవోత్తమా .
79 . శా" ఏ యేగోర్కెలనైన గోరునపుడే యెంతో మహాశ్చర్యమై
యాయా కోర్కెల వాక్సు ధారసముచే నందిచ్చునట్లిచ్చుచున్
నీ యౌదార్య దయా ప్రభావమది నా నేరంబులన్ నెంచుచున్
న్యాయంబాయిటు దాచియుంచగను నాయందీవు ఖాదర్ ప్రభూ .
80 . కం" నేరంబేమని యెంచితో
భారంబును నీదేయన్న భక్తుడుచేసే
నేరంబులు నీయవి, శా
రీరంబును నాత్మ నీదె శ్రీ ఖాదర్షా !
81 . శా" సారంబింతయులేని దానినిటు సంసారంబుగా నమ్ముచున్
ఘోరంబౌపెను మోహ సృంఖములజిక్కుల్ బొందగాలేక, వే
మారుల్ బిల్చిన బల్క వేమితగునా మాహాత్మ ! నీ భక్తుడన్
చేరందీయుచు బ్రోవుమింకనయినన్ శ్రీ షాజి దేవోత్తమా .
82 . మ" ధనమేమూలమిదమం జగత్తనేడి దుర్ ధర్మంబున్ గూడుటన్
ఘనతన్ నీచములిచ్చు మానవునకున్ గాబట్టి నేనెప్పుడున్
ధనమున్ దాన్యమున్ గోర, నీదు పదములన్ దాన్యంబునే గోరెదన్
గనుకన్ నాపయి బ్రేమ నుంచి యిడుమా ఖాదర్షబాబా గురూ .
83 . మ" భరియింపంగనులేను యీ యిహములో బ్రాపించు కష్టంబులన్
స్థిరతాయుండదు , బుద్దిసూన్యమగు బల్ చీకాకులామెండు, య
స్థిరమౌద్రవ్యమె మూలమౌను గనుకన్ ఛీయంచు నాశించకన్
వరనీపాదము సేవగోరితిడుమా వల్లీ ప్రభో , నిత్యమున్ .
84 . ఆ .వె" చిత్తమందు నీదు సేవతప్పగ నన్య
సేవసేయ మనసు సిద్ద పడదు
పాలముంచు నన్ను బలునీటముంచుము
కావనీవదిక్కు ఖాదరీంద్ర .
85 . కం" భక్తులకెల్లను బాగుగ
వ్యక్తముజేయుచును ముక్తినందెడి సూక్తుల్
యుక్తుల బోధను జేయుచు
వ్యక్తుల తరియింపజేయవయ్యా ఖాదర్ .
కం" నరుడవు నీవను భ్రమలో
స్థిరబుద్ద్దిని లేక నేను చిత్తమునండున్
పరమాత్ముండవు నీవని
యెరుగగలేనైతి ఖాదరీంద్రమనిన్నున్ .
86 కం" . కనులకు జూచుటకైనను
మనమున నూహింపనైన మాటలనైనన్
గనజాలని యవతారపు
ఘనతను విని , చేరితయ్య ఖాదరుభువా ?
87 . కం" పిల్లలు నేరము జేసినా
తల్లియు దండ్రియును వారి దండింతురె, వా
రల్లన క్షమియింపకుండ
కల్లయే నేనన్నమాట ఖాదరుషాజీ?
88 . సీ." ఇక్కడుండెదవన్న నక్కడక్కడి భక్త
గణముల చెంతను గలవు నీవు
ఈ రూపమేయన్న నెవ్వరే రూపంబు
దలతు రా రూపంబు దాల్తు నీవు
మానవుండీవన్న ,మానుష్య మునుమించు
దైవ శక్తులతోడ దనరు దీవు
మాహాత్ముడీవంచు మదిలోన దల్పంగ
నిన్ను చూడగ చింతలన్ని బోవు
తే "గీ " ఇట్టి ప్రత్యక్షదైవమై యిట్టే నీవు
సృష్టికి బ్రతిసృష్టి ని జేయుటేమి చేపుదు
ఎట్టి రూపమో పేరును నెట్టి దగునో
ఖాదరీంద్రమ దెలియంగ గలనే చెపుమ
89 . సీ" ఒక వంక దర్బారు చక చక సాగించు
చర్యలు బాగుగా సాగుదృష్టి
ఒకవంక కామ్యార్దు లను కామ్యసంసిద్దు
లొసగుచు దీవన లొసగు దృష్టి
ఒకవంక లోకాననుండేడి భక్తుల
క్షేమంబు తోడ , పోషించు దృష్టి
ఒకవంక గానంబు లొకవంక వాయిద్య
వింతలన్ వినుటకు గొంత దృష్టి .
తే"గీ" ఇన్ని దృష్టు లకలిగియు నెన్నియోను
లౌకికంబుల నెరవేర్చు లోకవినుత
పుడమి ప్రత్యక్ష దైవంబ బొగడదరమె
సర్వమున నుండు ఖాదరు షాజిదేవ .
90 . సీ" ఐహికాముష్మి కం బనియెడి రెండింట
గలుగు సుఖములొందు జ్ఞానమీయ
తగునట్టి బోధల తగునట్టి సూక్తుల
వాక్ రూపముననెట్టి వారికైన
మాటలాడుచుబోధ సూతుల దెల్పుచు
భక్త గణములనెల్ల భళిరయనగ
దుర్మార్గమున్ బాపి సన్మార్గమున్ జూపి
జన్మ రాహిత్యంబు జక్కనీయ .
90 . తే"గీ" బ్రహ్మ కళలెల్ల మేనున బ్రజ్వరిలగ
నిండుసభలోన గొల్వు ననుండుదేవ
పుడమి ప్రత్య క్ష దైవంబ బొగడదరమె
సర్వమయుడవు ఖాదరు షాజిదేవ.
91 . ఆ"వె" చక్కగా నీవు సంసారమందునే
యుందు గానినందు నొకడ వవకు
మనెడి బోధ జేసి మనుషుల మార్చేటి
ఖాదరీంద్ర నన్ను గావుమయ్య .
92 . సీ . తాను నేనంచును తనది నాదంచును
జాతి మతముల భేదమతులటంచు
ఉన్నతా ధమభేద మనినయ జ్ఞానంబు
పెద్ద చిన్న యనెడి భేదామసుచు
నాదైవ పరదైవ మాదైన భ్రమయంచు
గోపంబు నీర్షల గూడుటంచు
కర్మ గిర్మలటంచు, గడకు బ్రారబ్ధంబు,
గ్రహచారమనుచును, యహమటంచు.
తే .గీ . ఇట్టి భ్రమలతోగూడిన యట్టి ఘోర
మైన యజ్ఞానమూలంబు నడచి , మాకు
నేక భావంబు దెల్పెడి లోకపూర్ణ
ఖాదరుష బాబ నిన్నెన్న గలుగు టెట్లు?
93 . మ. కిటుకున్ జెప్పెద నాదు బొమ్మపయినిన్ కేంద్రీకరించన్ వలెన్
బటుచాంచల్యపునీ మనస్సు దొలినభ్యాసమున్ జేయుచున్
నటుపై నీమము దప్పకుండు సతమున్ యధ్యాత్మ వృద్దొందునం
చిటు బోధించిన ఖాదరీంద్ర ! కరుణా దృ ష్టిన ననున్ బ్రోవుమా .
94 ఉ" ఉన్నదినాదుచెంత ధనమున్నది యద్ది యుపారమౌచు , దా
నెన్నడు నింతయున్ దరుగదెవ్వరు కోరరు దాని నెప్పుడున్
ఉన్నాను జాలగానరు దుయుర్విని భ్రాంతి మునింగ
యున్న రహస్యమున్నిడుటనౌ నాకో యెంచగ ఖాదరు ప్రభూ "
95 తే"గీ' నన్ను జూచిన వ్యక్తి దాగాన్నులార
95 తే"గీ' నన్ను జూచిన వ్యక్తి దాగాన్నులార
దైవమును జూచినట్లనే దలచుడేపుడు
ననుచు బోధించి భ్రమలను నడచునట్టి
ఖాదరుష బాబ బ్రోవుమా కరుణ తోడ "
96 ఆ"వె" ఔర నీకు వలయు నఖిల సౌఖంబులు
బాబ యాజ్ఞ వలన బడయ గలవు
నమ్మి నీ హృదయము నాకు సమర్పింపు
మనుచు జెప్పు నిన్ను గనగ వశమే "
97 సీ" నీకు దూరంబు గా నేనుంటి ననుకోకు
నీవు నీ ద్రుష్టినన్ నిలుపుకొంటే
నీకు దూరంబు గా నేనుండ జాలను ;
నీ హృదయంబున నీవు నాకు
నివసించ చోటింత నీవు నాకిచ్చిన
నటులైన నీవాడనైన యట్లె
నీ వద్ద నెప్పుడున్ నే నుంటినే గాని
దూరమౌచును నుంటి దౌర నీకు "
తే"గీ" నేను నీ హృదయముననే నిండి యుండి
అప్పుడే నేను చేయనున్నట్టి పనిని
చేయుచున్నాను యని బోధ చేయు ప్రభువ
ఖాదరుషబాబ కావుమా కరుణ హృదయ "
98 తే"గీ" బాధ లోననె యుండెను బోధననుచు
న ర్ధమును జేసికోనగ ప్రయత్నమేపుడు
చేయవలె గాని బాధ తీస్వేయరాదు
అనుచు బోధించు ఖాదర్ష ఘన యతీంద్ర "
99 శా" నిన్నున్ నే గ్రహియించునంత వరకున్
నీ ప్రేమ సాయంబుచే
నిన్నున్ స్తోత్రము జేయ భక్త తతికిన్
నేర్పోండు వాక్యంబులన్
మిన్నంటన్ గల భక్తి వ్రాసితిని ,భూ
మిన్ దీని నా చంద్రమున్
బెన్నోందంగ , వరంబు నిమ్ము దయతో
శ్రీ ఖాదరీ రత్నమా "
100 తే"గీ" భక్తి తోడుత నిత్యంబు బఠన జేయు
భక్తవరులకు నిత్యంబు బాబదయను
కామ్యతతులొంది శ్రీ హరి కరుణ తోడ
యైహికాముష్మిక సుఖంబు లందుగాక"
మంగళహారతి
సీ" బంగారమైన హృత్ ,పళ్ళెరంబున బట్టు
నేను, నా, దనిన ,నజ్ఞ్యానమనెడు
చిలుమును నీ సేవ చేదోమి ,భక్తిలే
పనతోడ ,మెరుగెట్టి ,బ్రహ్మ బోధ ,
లనియెడు రత్నాలనద్దాని బొదిగించి
భ్రాంతినా కర్పూర ఫలకముంచి
జ్ఞ్యాన దీపంబు చే జక్కగా వెలిగించ
నేకత్వమై వెల్గ లోకమంత
తే"గీ" హారతిచ్చేను నీ భక్తుడైన భోగ
రాజుకులజుండ వెంకటరామయాఖ్యు
నిదిగో , యందుకో ,మ్మోయి నే నెంతయేని
భక్తినిచ్చితి ఖాదర్షబాబ దేవ "
మంగళం
శ్రీ శ్రీ శ్రీ ఖాదర్వలి ప్రత్యక్ష పరమేస్వరార్పితమస్తూ