51 శా" ఏయాదిక్యత నీకులేని యడలన్ నీరీతి వెల్ వేలుగా
నాయాసంబులను లెక్కజేయకయె వారత్యంత దూరస్తులున్
నీ యందున్ గల దైవశక్తిగనియే నీచెంతకున్ వత్తురో
యా యాదిక్యత జూపిబ్రోవు నను బాబా ఖాదిరీరత్నమా ."
52 . శా " సత్యంబున్ వచియింతు దైవము భువిన్ సాహస్ర రూపంబులన్
నిత్యంబున్ మనమందు గోర్కేలొసగున్ నీమంపు భక్తాళికిన్
ప్రత్యక్షంబునుగాకనే తమరో, హా ప్రత్యక్ష దైవంబవై
యత్యంతంబగు ప్రేమ బ్రోతురుగదా యౌనట్లు ఖాదర్ ప్రభూ"
53. శా" జ్ఞానాత్మున్ నను జేసెదంచు మదిలో నాశించి నిన్ జేరి , నీ
ధ్యానంబెప్పుడు జేయుచుంటి గనుకన్ దైర్యంబు సద్భక్తియున్
హా నాకున్ గలిగుండు నట్లు గాను నన్నాశీర్వదించన్ వలెన్
నేనాడున్ నిను గొల్చువాడనగుచున్ నివ్వీడ ఖాదర్ ప్రభో ."
54 శా . నాయజ్ఞానము బారదోలి ఘనను; జ్ఞానంబునిప్పించి యే
మాయల బొందగనీక దుర్భ్రమలలో మగ్నంబుగాకుండ నన్
జేయన్ జాలేడి వాడవీవగుటచే జేతుల్ సదామోడ్చు చున్
నీయందే సుమభారముంచితిని నేనింపొంద ఖాదర్ ప్రభూ ."
55 మ. నరజాలంబునేల్ల వేళలను, నానా కాంక్షలన్ దీర్చుచున్
పరమేశుంబలె బ్రోచుచుందువుగదా, బాబా ననున్ నట్లనే
వర నీ వాక్సుధ నిచ్చి బ్రోవకునికిన్ వహ్వారేయేమందు , ఖా
దరుషా ఖాదిరిబాబ నీకిదియెగా ధర్మంబు యోచింపుమా ."
56 మ" నిరతంబున్ నను బ్రేమ బ్రోచుచును , నా, నేరంబులన్ బాపుచున్
దిరమౌ భక్తిని నిచ్చి ప్రేమయుతమౌ , దృష్టిని ననున్ జూడు నీ
వరపాదంబులు దప్ప నమ్మనికర వ్వంతైన వేరేవ్వరిన్
కరముల్ మోడ్చుచు నీకే మ్రొక్కెదనుయో ఖాదర్ష బాబా గురూ "
57 మ " తరమా మానవకోటికేల్లరకు త్వత్పాదంపు మహాత్యమున్
నేరుంగగన్ , నినే నమ్మి ఎపుడున్ నీ ధ్యానమే జేయుచున్
సరి నీకీ యిలలేరు లేరనుచు , నీ సర్వంబు నీ దంచు ,నే
వ్వరినిన్ ,గోల్తురో వారికే దేలియుగా ! విశ్వేశ ఖాదర్ ప్రభూ "
58 మ" భరియింపంగనులేను యీ యిహములో బ్రాపించు కష్టంబులన్
స్థిరతా యుండదు , బుద్ధి సూన్యమగు ,బల్ చికాకులా మెండు ,య
స్థిరమౌ , సంపద బోవు వెన్క గనుకన్ ,ఛీ , యొల్లనేనైహికం
బు , రవం తైనను ఖాదరీంద్ర ప్రభు నీ పూజల్ సదా గోరెదన్ "
59 మ" సరి నీకీ భువి వేరటం చెరిగితిన్ సత్యంబుగా నమ్ముమా
మరి వేరెవ్వరి నమ్మజాలను సుమా , మర్మంబులేకుండా; నీ
వరపాదంబుల నమ్మియుంటి నిక తత్ భక్తిన్ దయన్ నిమ్ము ఖా
దరువల్లీ ప్రభు ఓ దయా హృదయ మద్దైవంబ ప్రేమంబుతోన్."
60 శా" ఆరోగ్యంబును వృద్ధి జేయు టొకటిన్ ఆ పైని నా కేప్పుడున్
మీరా , మీరనకుండునట్టి బ్రతుకున్ మీ రిచ్చుటల్ రెండు, నా
నేరంబుల్ క్షమియింప మూడు సతమున్ నీ సేవతో నాల్గు యీ
వరముల్ మాత్రము నిచ్చి బ్రోవు మెపుడున్ వల్లీప్రభో భక్తుడన్."
61 . శా " ఒల్లన్ మేడలు మిద్దెలున్ ధనము, నే నొల్లన్ నిహంబెప్పుడున్
నొల్లన్ నీ దగు సేవతప్ప నితరంబోదేవ ! నీ ప్రేమతో
చల్లంగా దయజూచుటొకటేయె చాలంచునే గోరితిన్
కల్లల్ జెప్పగలేదు సత్యమిది యో ఖాదర్ష బాబాగురూ" .
62 . శా" కుక్షిన్ సర్వప్రపంచము న్నేరుగుచున్ గూర్చుండి దర్బారులో
అక్షిణంబగు ప్రేమ భక్త తతులందందున్ నినున్ గోర నా వెంటనే
సాక్షాత్కారామునిచ్చు మేటి కరుణన్ జక్కంగ నాకీయగన్
కక్షన్ బూనుచు జూపవేమి ప్రభువా ఖాదర్షదేవప్రభో" .
63 . శా" సౌఖ్యంబంన్నదిలేక, గష్ట యుతమౌ సంసారపున్ జైలులో
నిత్యంబున్ గల మోహసృంఖములచే నేజిక్కియున్నాడ, నా
నిత్యాజ్ఞత్వపునేర శిక్షకిటులన్ నేనోర్వలేకుంట నీ ,
యత్యౌదార్యపు ప్రేమ నొక్కటియె నేనాశించితిన్ సద్గురూ" .
64 శా" ఏరా నీదయ నా దుపట్లనిడకన్ నిట్లున్ నుపేక్షింతువా
పారావారమువంటి కష్టతతులన్ బ్రాల్మాలుటన్ జిక్కి, కా
ల్జారన్మున్గితి దిక్కు నీవదరి జేర్చన్ నీదు మేటైనసత్
కారుణ్యం బను నా వనిమ్ము దయతో ఖాదర్ష దేవప్రభో ".
65 శా" పాపంబెన్నడు బుధి పూర్వకము గా బ్రాల్మాలినే జేయునే
పాపాత్మాళినిజేర ,నిత్యమును నే భక్తిన్ స్మరింతున్ నినున్
నా పాలం గలదైవ మీవయగుచున్ నన్నేల రక్షించవో
కోపంబన్నది నీకు కూడా గలదో గోప్యంబు వె జెప్పుమా"
66 శా " నా తపంబును దీర్చు వారలేవరో నన్నీవు పెక్షించినన్
జూతామంచు ను పే క్షచేయదగునా జోక్యంబు నాకేలనం
చోతండ్రీ దయజూడ వెలసుతు పై నొక్కింత ప్రేముంచు నీ
చేతన్ జిక్కి తి నీవదిక్కు గనుమా శ్రీ ఖాదరీ రత్నమా"
67 శా" కప్పన్ ,విప్ప సమర్ధతంగలిగి నా కర్మంపు గారాకులన్
నిప్పంటించు విధాన నీ మహిచే నిర్మూలమున్ జేసి ,మా
యప్పా !రక్షక నన్ను బ్రోవ విటులన్ న్యాయంబే నీ భక్తునిన్
యేప్పట్లన్ గణనీవ దిక్కు యితరంబెవ్వారు ఖాదర్ ప్రభో "
68 శా" కళ్యాణంబుల నిచ్చ్చి బ్రోచు మునులన్ జ్ఞ్యానాత్ములౌ యోగులన్
దుల్యుండెవ్వడు నీకు లేడనుచు నెందున్ ఢంకవాయించి , సా
కల్యంబౌనటు సాటి చెప్పెదనుయో ఖాదర్ష , నా బుద్ధి , చాం
చల్యంబన్నది తీసి వేయమికనో షాజీ గురోత్తంసమా "
69 శా" వేదాంతాడ్యులు శాస్త్రవేత్తలు మరిన్ విజ్ఞ్యాన పారీణులున్
యా దైవజ్ఞ్యులు బల్ ధనాధి పతులున్ న్నాదైన వారెల్ల నీ
పాదాబ్జంబుల మ్రొక్కి ధన్యులగుటన్ ప్రత్యక్ష దైవంబ వీ
వౌ దంచున్ మరి వేరే చెప్పవలెనా యయ్యారే బాబా గురూ "
70 మ" తల క్రిందన్ ధనముంచు కొంచు సహహా దారిద్ర్యమున్ బొందుచున్
బలు చీకాకుల బొందు వాని గతి ,నీ పజ్ఞ్యా మహాత్యంబులన్
దెలియన్ నేరక వారు వీరనుచునే దీనత్వమున్ బొందితిన్
కలుషంబుల్ తెగటార్చి బ్రోవుమికనో ఖాదర్ష బాబా గురూ "
71 మ" పది యౌతారములేత్తియున్ జగమునున్ బాలించ లోటుంటచే
మదిలో యోచన్ జేసి జేసి తుదకున్ మా భర్తవౌ నీవుహ
పదకుండౌ యవతారమేత్తితివ యీ బాబా యనే రూపుతో
సదసద్రూప ? వినోదమొందుటకునై షాజిప్రభో చిత్రమౌ "
72 శా" ప్రత్యక్షంబగు దైవమీవయగుచున్ భక్తాళి నేవ్వేళలన్
సత్యాసత్య వివేక జ్ఞ్యాన మిడుచున్ సన్మౌలన్ జేయుచున్
యత్యౌదార్యపు బ్రహ్మ మౌనులటులట య్యారేవేమార్చుచున్
నిత్యాస్చర్య ప్రతాపముల్ తెలియగా నేట్లౌను ఖాదర్ ప్రభూ "
73 శా" కష్టంబుల్ గడతేర్చుటందు మరియున్ గాంక్షలు బ్రసాదించుటల్
సృష్టిన్ వె బ్రతిసృష్టి చేయుటకు వెల్ చిత్రంపు నీ ప్రజ్ఞ్యలన్
సృష్టిన్ జేసెడి బ్రహ్మ కే దెలియు నా గుట్టేదో మా బొంట్లకున్
స్వష్టంబౌటదియెట్లు ఖాదరు వలీ షాజీ ప్రభో సద్గురూ "
74 శా" జాలంబింతయు జేయకయ్య సతమున్ సద్ భక్తీతో గొల్చెదన్
కాలం బిం తయు వ్యర్ధ పుచ్చకనే నేక్కాలంబునన్ నిన్ దల్చునన్
చాలన్ బ్రేమనుబ్రోవు మెప్పుడున్ నోషాజీ మహాత్మా దయన్
పాలించంగను నౌతరించు ప్రభువా ?భక్తాళి సంపోషితా "
సీ" లాభంబు లేదింక లావులేదాయువు
బ్రతుకదంచును బైట బడగ జేయు
బడువారు నీ వాక్కు బడయగ నంతనే
నారోగ్యవంతులై యలరజేయు
'లా'కు విరుద్ధ మై లాభంబు లేదింక
దావాలు పోవుట దప్పదనిన
నీ వాక్కు చే గెల్చు నిమసంబులో బొంది
గత ఫలంబులు గూడ గాంచ జేయు
75 తే"గీ" ఊడసిద్ధమౌ యుద్యోగముండజేసి
ఉన్నతోద్యోగమునుగూడ నొంద జేయు
నీదు చిత్రంపు మహిమ నామీద జూపి
సౌఖ్య జన్మంబు గామార్చు షాజీ ప్రభువ"
సీ" గొడ్డు కొబ్బరి చెట్టు కొమ్మల రెంటితో
గొప్పగా గావించు గొప్ప మహిమ
గొడ్రాండ్ర్ కెల్లను కోరిన చందాన
కొడుకులో గూతుండ్రో గూర్చు మహిమ
గొడ్డుటావుల నెల్ల గొప్ప పాలిచ్చేడి
గంగి గోవుల జేయుగలుగ మహిమ
పండని భూములన్ ఫలవంతముగ జేసి
హెచ్చైన పంటలా నిచ్చు మహిమ
to continue click on page 4