Wednesday, 9 November 2011
Parichayam ( Extracted from Khadar baba shatakam published in 1957)
ఈ శతక కవి శ్రీ భోగరాజు వెంకట రామయ్య గారు శ్రీ శ్రీ శ్రీ బాబా ఖాదర్‌వలి వారి అంతరంగిక శిష్యుల లో నొకరు . బాబా వారి జీవిత చరిత్ర లోని కొన్ని ముఖ్య అంశములను , వారి బోధనలను , వారి మహాత్మ్యము ను , పద్య రూపమున పాడుకొనుటకు , ఈ శతకము చాల బాగున్నది , ఇందులో కొన్ని పద్యములు చదువుతుంటే శరీరము పులకరించి ఉన్మత్తులను చేస్తుంది . కారణం కవి స్వానుభవములను మనః పూర్తిగా మనకు చెప్పు తున్నాడు.
ఇందలి పద్యములు , కేవలము పాత ప్రచురణల లోనివే కాక చాల భాగం కొత్తవి చేర్చబడ్డై. భాష చాల శులభం గా ఉంది
శైలి చాల మందికి నచ్చేటట్లు గా వ్రాయబడ్డది . దీనిని కేవలం కొత్త శతకమనే అనవచ్చు .
శ్రీ బాబా గారి భక్తులందరూ ఇందలి రసమును గ్రోలుదురు గాక .
పులిపాక సూర్యప్రకాశ రావు
జయపురం
ఫిబ్రవరి 1957
ఓం నమో భగవతే ఖాదర్ బాబాయ నమః
శ్రీ ఖాదర్ బాబా శతకము
1 సీ " శ్రీ దేవ దేవాయ శ్రితజన పోషాయ
కారుణ్య హృదయాయ జ్ఞ్యానదాయ
కర్మ విధ్వంసాయ కల్మష నాశాయ
ధర్మ సంరక్షాయ నిర్మలాయ
భక్త పోషణదీక్ష భరితాయ. శుభదాయ
పాప విధ్వంసిత పావనాయ
శంఖు చక్రాంకిత చరణాయ వరదాయ
కామితఫలద సన్నామ ధేయ
చిత్ర మాహత్య చరితాయ చిన్మ యాయ
ఘోర పాప ధ్వంసిత శక్తి ధారణాయ
భక్త పాలిత దీక్ష సుపాలితాయ
బాబా ఖాదర్‌వలీ లోక పాలితాయ "
2 ఊ " నీ యవతారమున్ మహిమ ,నీదగు రూపము , వాక్ ప్రభావమున్
గాయపు బ్రహ్మ తేజమును ,గాఢపు యోచన చేసి చూడగా
వేయి శిరంబులున్ గనులు వేయిపదంబుల విష్ణు దేవుడే
గా , యని దోప జేయు ప్రభు ఖదరు షాజీ మహాత్మా !బ్రోవుమా "
3 మ" సిరులోల్కందగు మోము తో నిరతమున్ శిష్యాళికిన్ బ్రేమతో
పరామార్ధంబును బోధజేసి ,తరియింపన్ జేయ నీ రీతిగా
హరి బ్రహ్మాదుల మువ్వురంగలుగు నా యా శక్తులం బూని ,స
త్కరుణన్ నీ వవతార మెత్తిత్తివిగా ఖాదర్ష బాబా భువిన్ "
4 మ" తల మేవ్వారికి గల్గు, నీదగు మహత్వం బెన్న నే నియ్యెడన్
గలనంచున్ దలబెట్టినాడను జుమా కార్యంబు చెకూర నీ
దలపై భారము మోపి , యీ శతక పద్యాళిన్ రచింపగనే
గలమున్ బట్టిది నీదు భారమనుచున్ ఖాదర్ష దేవ ప్రభూ "
5 మ" తిధి రత్నంబు వికారి వత్సరపు కార్తీక శుధ పక్షంబునన్
బుధవారంబున నాగ పూజ చవితిన్ బూర్నుండ వీ వౌట, హ
బుధులోందన్ దగు శంఖ చక్రములు నీ పుణ్యంపు పాదంబులన్
ద ధి కాస్చార్యము గల్గ దాల్చి జననంబై తోయి ఖాదర్ప్రభో "

6 సీ" ముమ్మూర్తులందలి ముఖ్యాంశలన్ దెచ్చి
ప్రేమామ్రుతంబు తో బిసిగి దాని
కరుణామృతంబు తో గట్టి ముద్దగ జేసి
యానంద రసము , మోమందు గలిపి
నేత్ర యుగ్మము నందు నిఖిల ప్రాణుల యందు
దయతోడి చూపులన్ దనర నుంచి
శాంత రసము దెచ్చి చక్క గా నోడబోసి
ఉత్తమాధమ భేద చెత్త దీసి "
తే "గీ " తేట నేల్లను గల్పుచు మాటలందు
బ్రహ్మ కళలను మేనున ప్రజ్వరిలగ
హరిహరుల మహిమల తోడ మేరగు బెట్టి
బ్రహ్మ సృష్టించే ఖాదర్ష బాబా నిన్ను "
7 మ" మదక్రోధద్వయ నాశ కారి వగుటన్ ,మత్తేభ శార్దూలముల్
ముద మారంగను నూటినింగలిపినే మొత్తంబులన్ వజ్రముల్
గదియంగల్పుచు మాల రీతి నిడి తో ఖాదర్ష బాబా? భవత్
పద భక్తిన్ నిదికంఠమందు ధరియింపన్ గోరి మన్నింపుమా
శా " పాలం గూడిన నీటినిన్ వదలి యా పాలన్ గహించున్ సదా
లీలన్, నద్దరి రాజహంస యటులే లెక్కింపకే దోషముల్
మూలన్ ద్రోయుచు మేళులే గొనుము ,నింపుంబొందు బ్రేమంబుతో
కౌలీనంబును బొందకుండగనునో ఖాదర్ష బాబా గురూ"
8 శా " వేత్తల్ తాతయు నాయనమ్మ యను నీ పిత్రుండు నీ మాతయున్
విత్తేదో అలవృక్షమున్ నదియేయౌ వేరౌచుదాబుట్టదే
మొత్తంబందున నీవు వేత్తవగుటన్ బూర్వంపుటాచారమే
చిత్తంబందున సంశయంబు గలదే శ్రీ ఖాదరీ రత్నమా "
9 మ" గురువన్నన్ భువి బేరునొందు ఘనుడై కోటీస్వరుల్ సైతము
నిరతంబున్ దమపాద భక్తీ రతులై నీమంబుతో గొల్వనా
సురలన్ బ్రహ్మ యో , విష్ణుడో ,శివుడో ,తాజుద్దీను రూపంబుతో
గరుణన్ బుట్టె ననంగ జాలు ఘనుడౌ ఖాదర్ష బాబా గురూ "
10 శా " పూలన్ గల్గును వాసనల్ మొదటనే పూ మొగ్గలె దేల్పుగా
బాల ప్రాయము నందే నీదు ఘనమౌ ప్రజ్ఞ్యానసంవాసనా
లీలన్ బూచిన దోచుచుండు భువిలో గ్లేశంబులన్ బాపగా
గైలాసాధిపుడౌతరించేననుచున్ ఖాదర్ష దేవోత్తమా "
11 శా " నీకున్ బాలిడుదాదియింటనట నీ నిద్రించు నవ్వేళహ
హకాల్పోయెను నగ్ని బుట్టి ఎటులో నా వీధి వీధంతయున్
నీకై జెందిన ఇల్లు మాత్ర మటులే నిద్రించు నీ తోడ , జీ
కాకున్ లేకను హాయి నండుటన, నిక్కంబీవు శ్రీ కృష్ణవే"
12 మ" గురునాజ్ఞ్యన్ సిరసావహించి తమరీ కొండ ప్రదేశంబులో
దిరమౌ దీక్షనుబూని మేటిదయతో దీనిన్ బ్రపంచంబులో
వరక్షేత్రంబుగ జేసినారుగద బాబా ఖదరీ యోగీ , ఖా
దరుషాబాబ ! జనాళి పుణ్య ఫలమేంతన్ జెప్పుదున్ శక్యమే "
13 మ " సకలైశ్వర్య నమున్నతిన్ గలిగి తత్సౌఖ్యం బులాసించకే
సకలోత్క్రుష్టపు ఖాదరీ పదవికై సంకల్ప మున్ బూని నీ
సకలంబున్ త్వజియించి నాడవల భీష్మాచార్ల్యునింబోలె హ
యకళంకాత్ముడ వైన నీకు సరి బాబా ? లేరు లేరీ భువిన్ "
14 మ " గురువే బ్రహ్మము విష్ణు డీసుడనుచున్ గుర్వే జగత్తంచు , నీ
గురువున్ మించిన దేద్దిలేదనుచు నా గూడైక సారంబుతో
పరిపూర్ణంబు గ్రహించియుండి యిదియే బ్రహ్మంబు బ్రహంబే
ధరలో సర్వమటంచు నీ వేరిగితో ధన్యాత్మా !బాబ గురూ "
15 మ " క్షితిపైగల్గెడి కోర్కె లేవ్వియును నీ చిత్తంబునన్ జేర్చకే
మతి నీ సద్గురు మంత్రమందుని చితన్మంత్రంబునే జెప్పుచున్
యతివై సద్గురు గొల్చుచుంటగనగా నాశ్చర్యమౌగాదె యీ
కతమున్ నీదగు ప్రజ్ఞ్యనెన్నవశమా ఖాదర్ష బాబా గురూ "
16 మ" మతితో దృష్టి ని మేళవించి విమలంబైనట్టి తేజస్సు నం
దతి దీక్షన్ జొర జేసి నిశ్చలముతో నా బ్రహ్మమున్ జూచుచున్
క్షితి పై ధ్యానము లేక మైమరచుచున్ జిజ్ఞ్యాస పూర్నుండవౌ
కతమున్ నీదగు ప్రజ్ఞ్యనెన్న వశమా ఖాదర్షయో సద్గురూ "
17 శా" ఎండల్ వానల నెంచకుండగను నీవెంతేని దీక్షించి యీ
కొండల చెంతను నిర్జనంబగు చుహా ఘోరంపుబల్ సర్పముల్
మెండౌ దుష్ట మ్రుగంబులుండు స్థలి లో బ్రీతిని దపశ్శాలివై
యుండన్ , నీ దగు ప్రజ్ఞ్యనెన్న వశమాయో ఖాదరీంద్రోత్తమా
18 శా " ఈ రీతిన్ పరమాత్ముతో సముడ వై యీ పర్వతారణ్యముల్
ఘోరంబైయేడి క్రూర జంతు భయముల్ కూనీలు , చోరీలు , యా
చోరీలంగల హత్యలున్ గల స్థలిన్ సుక్షేత్రమున్ జేయు నీ
వరమాహత్యపు ప్రజ్ఞ్య నెన్న వసమా వహ్వా రే బాబా ప్రభో "
19 శా " ఈ నీయాశ్రమ శోభలెన్నదరమా ఎంతో మహా చిత్ర మౌ
నానా జాతుల పక్షివృక్ష చయముల్ న్యాయంపు సత్శోభ తో
నే నాటన్ మరి యెచ్చటన్ గననివే యిచ్చోటి బల్ చిత్రముల్
కానన్ నీ మహిమం బులెన్న దరమా ఖాదర్ష యో సద్గురూ "
20 శా " రండో రండిటు లార్తు లేల్లరును , వే , రక్షించు దైవంబిటన్
నుండెన్ దీక్షను బూని ఖాదరుష నే యోప్పైన నామంబుతో
నిండౌ ప్రేమను వాక్సుధారసముచే నీ కోర్కెదీర్చంచు నీ
జండా పిల్ల్చున నంగగాలినేగురున్ చక్కంగ సంశోభలన్
21 మ" అమనస్కంబున బూర్నుడై జనులకున్ నయ్యైమనో వాంచ్చలన్
దమకున్ వెంటనే నిచ్చి బ్రోచు నిట ఖాదర్‌షా మహాత్ముండు నా
నెమళుల్ బిల్చున సంగకూయునుగదా నిల్చుండి యా చెట్ల పై
తమదౌ యాశ్రమ శోభలెన్న దరమా దైవంబ ఖాదర్ ప్రభూ "
22 శా" నీ యాస్థాన వటంబులన్ జనులు హనీమంబుతో మూడుమా
ర్లేయేగోర్కే ప్రదక్షణంబు సలుపున్ నేవ్వారో వార్వారికిన్
యా యాకోర్కెల నిచ్చి బ్రోతువు గదా యౌదార్య మహత్తు చే
నీ యాశ్చర్యపుటా శ్రమంపు మహిమల్ నే నెంతగా జెప్పెదన్ "
23 మ" తపమున్ జేసెడువేళ భీతినిడు విస్తారంపు సైక్లోను లో
విపరీతంబగు నీట త్రాచోకటి హవిస్తార మౌ భీతి చే
పదమున్ బట్టగా లక్ష్య ముంచకనే సద్ బ్రహ్మంబునన్ లీనమై
దపమున్ జేసెడి మేటి మౌనివిగ ఖాదర్ష ప్రభో చిత్రమౌ "
24 శా" కళ్ళంగానని యంతవర్షమున్ పెంగాలిన్ సహా ఘోరమై
రాళ్ళట్లే , వడగండ్ల వాన పగలున్ రాత్రిన్ సహా పడ్డ నీ
రేళ్ళున్ గెడ్డలరీతి బారదమకున్ నింతేని లక్ష్యంబులే
కోళ్ళున్ దేల్యని దీక్ష నుంటివి గదా యో ఖదరీ రత్నమా "
25 మ" మనసున్ దృష్టిని మేళ వించి ,యల బ్రహ్మానంద మగ్నుండవై
ఘన యోగంబున నుండు నీడుమెడ జక్కం జుట్టే పెన్ బాము విం
తను జూడంగను శంకరుండనుచు నెంతన్నొప్పు నీ ధ్యానమున్
గన నాశ్చర్యము బాల్య మందు తపమున్ ఖాదర్ష మద్దైవమా"
To continue click on page 2

Subscribe to:
Posts (Atom)